మరో ఆవర్తనం: 3 రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన - ap temperatures and rains
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి మధ్య అరేబియా సముద్రం వరకూ... ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ మీదgగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసాయని తెలిపింది. రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది.
రాష్ట్రంలో నేటి వాతావరణ విశేషాలురాష్ట్రంలో నేటి వాతావరణ విశేషాలు
By
Published : Oct 14, 2020, 9:01 PM IST
|
Updated : Oct 15, 2020, 11:58 AM IST
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి మధ్య అరేబియా సముద్రం వరకూ... ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ మీదగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, తెలంగాణపై కేంద్రీకృతమై ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ తెలియచేసింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోని విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలియచేసింది.