Weather Report Over Rains in AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులపాటు కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటక మీదుగా ఒడిశా వరకూ మరో ద్రోణి కూడా ఆవరించి ఉన్నట్టు వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో పశ్చిమ భారత్తోని ప్రాంతాలతోపాటు కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. నేటి నుంచి 16వ తేదీ వరకూ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Rains Alerts in AP: రాగల రెండు రోజులపాటు కోస్తాంధ్ర జిల్లాల్లో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ! - Weather Outlook Rains Over State
Weather Report Over Rains in AP: రాగల రెండు రోజులపాటు కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నేటి నుంచి 16వ తేదీ వరకూ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
'కర్ణాటక, మహారాష్ట్రలోని విదర్భ, ఛత్తీస్గఢ్, తెలంగాణ.. తదితర ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి. అటు రాయలసీమలోనూ రాగల రెండు రోజుల్లో తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉంది. మరోవైపు కోస్తాంధ్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు కూడా బాగా పడిపోవచ్చు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి' అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది.
ఇదీ చదవండి.. :Arrest: చంద్రయ్య హత్య కేసు నిందితులను అరెస్టు చేశాం: ఎస్పీ