ఆంధ్రప్రదేశ్

andhra pradesh

WEATHER REPORT: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల రెండ్రోజులు భారీ వర్షాలు

By

Published : Sep 6, 2021, 1:57 PM IST

Updated : Sep 6, 2021, 10:27 PM IST

ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీగా వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

today-weather-report-in-andhra-pradesh
రాగల రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. యానాంతో పాటు కోస్తాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమలోనూ కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్టు అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారినందున.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వంగర మండలం మడ్డువలస జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. సువర్ణముఖి, వేగవతి నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. అధికారులు మడ్డువలస ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మడ్డువలస నుంచి వచ్చే నీటితో నాగావళి నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

విశాఖ జిల్లాలో..

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున హెచ్చరించారు. ఈ సమయంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాలకు ఏమైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు ఫోన్ చెయ్యాలన్నారు.

సమస్యలపై సంప్రదించాల్సిన నెెంబర్లు..

  • విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ – 1800-425-00002, 0891-2590100, 0891-2590102
  • సబ్ కలెక్టర్, పాడేరు - 08935- 250228
  • ఆర్ .డి.ఓ.విశాఖపట్నం - 0891- 2562977
  • ఆర్.డి.ఓ. అనకాపల్లి - 08924- 223316
  • ఆర్.డి.ఓ. నర్సీపట్నం - 08932 -226433

తూ.గో.జిల్లాలో..

మరో మూడు రోజులు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరికిరణ్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. కలెక్టరేట్, డివిజన్ కేంద్రాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ నెంబర్లు..

  • కలెక్టరేట్, కాకినాడ – 1800-425-3077
  • ఆర్డీఓ కార్యాలయం కాకినాడ – 0884-2368100, 8008803208
  • ఆర్డీఓ కార్యాలయం, అమలాపురం – 088556-233208, 8008803201
  • ఆర్డీఓ కార్యాలయం, రామచంద్రాపురం – 08857-2451566, 9618433012
  • ఆర్డీఓ కార్యాలయం, పెద్దాపురం – 9603663327
  • పీఓ, ఐటీడీఏ, రంపచోడవరం – 1800-425-2123
  • సబ్ కలెక్టర్ కార్యాలయం, రంపచోడవరం – 08864- 243561, 9618433012
  • సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం – 8008803191
  • ఆర్డీఓ కార్యాలయం, ఎటపాక - 9491687515

ఇదీ చూడండి:రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

Last Updated : Sep 6, 2021, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details