తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 13 అంశాలు అజెండాగా పొలిట్‌బ్యూరో భేటీ కానుంది. రాష్ట్రంలో నెలకొన్న వివిధ ప్రజాసమస్యలపై పోరాటానికి వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థలు, సహాకార, పురపాలక, నగర పాలక తదితర ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అందులో పార్టీ అభ్యర్ధులు గెలిపించేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు తదితరులకు బాధ్యతలు అప్పగిస్తారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికలకు అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గ్రామ,వార్డు, మండల, డివిజన్, నగర కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానం ఒక యూనిట్‌గా తీసుకుని అడ్‌హక్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నది అధినేత ఆలోచనగా తెలుస్తోంది. పార్టీకి అనుబంధంగా మొత్తం 16 అనుబంధ సంస్థలకు కార్యవర్గం ఏర్పాటు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంధానకర్తల నియామకానికి నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం - తెదేపా పోలిట్ బ్యూరో భేటీలో కీలక నిర్ణయాలు
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అజెండాగా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కమిటీల ఏర్పాటు సహా పార్టీ ప్రక్షాళన దిశగా అధినేత చర్యలు చేపట్టున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ సన్నద్ధత పైనా భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ముగ్గుర్ని పొలిట్ బ్యూరోలోకి కొత్తగా తీసుకోనున్నారు.

today-tdp-polit-bureauo-meet-preside-supremo-chandrababu-naidu
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం
ఇదీ చదవండి : 'తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు'
Last Updated : Oct 17, 2019, 5:37 AM IST