ఆంగ్లమాధ్యమం అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం.. 81, 85 జీవోలను తెచ్చింది. ఆ జీవోలను హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే ధర్మాసనం.. సర్కార్ పిటిషన్‌ను విచారించనుంది.
ఆంగ్లమాధ్యమంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ - english medium in
ఆంగ్లమాధ్యమం అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది.
supreme court on english medium