ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ ప్రక్రియ నేటి నుంచి అమలు కానుంది. తొలి విడతలో వైద్యారోగ్య సిబ్బందికి మాత్రమే పరిమితమైన వ్యాక్సినేషన్‌.. రెండో విడతలో మరిన్ని శాఖల సిబ్బందికి వేయనున్నారు. రెండో విడత టీకాల కోసం 5 లక్షల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
second phase corona vaccination process

By

Published : Feb 3, 2021, 3:46 AM IST

రెండో విడత కరోనా టీకా పంపిణీకి రాష్ట్రం సిద్ధమైంది. నేటి నుంచి రెండో విడత కరోనా టీకాల పంపిణీ ప్రారంభించనున్నారు. పంచాయతీ రాజ్, పురపాలక , రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రెండో విడతలో వ్యాక్సిన్ కోసం 5 లక్షల 90 వేల మంది నమోదు చేసుకోగా.. వారందరికీ ఇచ్చేలా 3 వేల 181 సెషన్ సైట్​లను ప్రభుత్వం సిద్ధం చేసింది.

మొదటి విడతలో వైద్యారోగ్య శాఖలోని క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేశారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 88 వేల 307 మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు లక్షా 8 వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి అయింది. మరో 2 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉంది. తొలి విడత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యారోగ్య శాఖ.. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే విషయాన్ని వివిధ శాఖల్లోని ఉద్యోగులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా 79 దుష్ప్రభావ ఘటనలు ఎదురైనట్టు ప్రభుత్వం తెలిపింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details