ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీకి చేరుకోనున్నారు. ఎన్నికల కమిషన్‌తో పాటు హోంశాఖ అధికారులను కలిసే అవకాశం ఉంది. పార్టీ, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ ఇచ్చిన నోటీసుపై ఇప్పటికే ఆయన స్పందించారు. కొద్దిరోజుల కిందట కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.. ఎంపీ విజ్ఞప్తిని అదే రోజు హోంశాఖ కార్యదర్శికి స్పీకర్ కార్యాలయం పంపింది. ఇదే అంశంపై ఇవాళ స్పీకర్‌ను కలిసే అవకాశం కూడా ఉంది.
దిల్లీకి రఘురామకృష్ణరాజు..స్పీకర్, హోంశాఖ అధికారులను కలిసే అవకాశం! - raghurama krishna raju is going to delhi
ఇవాళ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల కమిషన్‌తో పాటు హోంశాఖ అధికారులను కలిసే అవకాశం ఉంది.
raghurama krishnam raju