PROTEST: సీపీఎస్ రద్దు చేస్తానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు హామీ పింఛన్ పథకం (జీపీఎస్) అమలు చేస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం విశ్వాస ఘాతుకం నిరసనలు నిర్వహిస్తున్నట్లు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్‌ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి తెలిపారు.
PROTEST: జీపీఎస్‌కు వ్యతిరేకంగా నేడు "విశ్వాస ఘాతుక" నిరసనలు - andhra pradesh latest news
PROTEST: హామీ పింఛన్ పథకం (జీపీఎస్) అమలు చేస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం విశ్వాస ఘాతుకం పేరుతో నిరసనలు నిర్వహిస్తున్నట్లు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్‌ఈఏ) అధ్యక్షుడు అప్పలరాజు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ సమాచారంపై ఏరోజూ శ్వేతపత్రం విడుదల చేయని ప్రభుత్వం.. సీపీఎస్ ఉద్యోగుల లెక్కలపై మాత్రం రూ.కోట్ల ఖర్చుతో అసత్య ప్రచారం చేస్తోంది అని విమర్శించారు.
![PROTEST: జీపీఎస్‌కు వ్యతిరేకంగా నేడు "విశ్వాస ఘాతుక" నిరసనలు PROTEST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15162585-910-15162585-1651376616176.jpg)
‘అన్ని జిల్లాకేంద్రాల్లో విశ్వాసఘాతుకం నిరసన సభలు, కొన్నిచోట్ల నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాం. పాత పింఛన్ విధానాన్ని అమలుచేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. హామీనిచ్చి ఆ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి ఆ తర్వాత హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని ఇంటికి పంపమని సీఎం జగన్ ఎన్నికల ముందు చెప్పారు. మరి ఆయన్ని ఎక్కడికి పంపాలో ఆయనే చెప్పాలి. ఉద్యోగులు, రాష్ట్ర బడ్జెట్ సమాచారంపై ఏరోజూ శ్వేతపత్రం విడుదల చేయని ప్రభుత్వం.. సీపీఎస్ ఉద్యోగుల లెక్కలపై మాత్రం రూ.కోట్ల ఖర్చుతో అసత్య ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు.
ఇదీ చదవండి:వైకాపాలో వర్గపోరు ... కొట్లాటల నుంచి హత్యల వరకు..