Omicron Cases in Telangana: తెలంగాణలో తాజాగా మరొకరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్యం 8కి చేరిది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.
దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 8 కేసులు నిర్ధరణయ్యాయి. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధరణైంది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు. వైరస్ సోకిన బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదు. దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే ఆస్పత్రుల్లో చేరారు. ఒమిక్రాన్‌తో ప్రాణాపాయం లేదు. ఒమిక్రాన్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ మరణమే నమోదైంది. ఒమిక్రాన్ పట్ల అనవసర భయాందోళన అవసరంలేదు. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడమే కూడా వ్యాప్తికి కారణం. రాష్ట్రంలో 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు, 56 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. -శ్రీనివాసరావు, డీహెచ్, తెలంగాణ