ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పాలక మండలి సమావేశం.. వీసీ ఆధ్వర్యంలో నేడు జరగనుంది. అజెండాలో భాగంగా రెండు అంశాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపైనే ప్రధాన అజెండాగా చర్చించనున్నారు.
నేడు సమావేశం కానున్న.. ఎన్టీఆర్ వర్సిటీ పాలక మండలి - ap 2021 news
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పాలక మండలి(ఈసీ) సమావేశం నేడు (శనివారం) జరగనుంది. పాలకమండలి ఛైర్మన్‌గా ఉన్న వర్సిటీ వీసీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.
నేడు సమావేశం కానున్న ఎన్టీఆర్ వర్సిటీ పాలక మండలి
వర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న నిధులను ప్రభుత్వానికి డిపాజిట్ చేసే అంశంపై పాలకమండలి సభ్యులు చర్చిస్తారు. సాధ్యాసాధ్యాలపై చర్చించి పాలకమండలి నిర్ణయం తీసుకుంటుందని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:MINISTER PERNI NANI: బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం తెలియదు: పేర్ని నాని