రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నీలం సాహ్ని ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 9.30 గంటలకు విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారు. అనంతరం సీఎస్ ,డీజీపీతో సమావేశం కానున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.
నేడు ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతల స్వీకరణ - ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని
రాష్ట్ర ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలను స్వీకరించనున్నారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలు చేపడుతారు. సీఎస్, డీజీపీలతో సమావేశం అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
neelam sahni to take charge as new sec