ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

application for wine shops : నేడే ఆఖరు...వెల్లువలా దరఖాస్తులు - మద్యం దుకాణాలు ఏర్పాటు

తెలంగాణలో మద్యం దుకాణాల(application for liquor license)కు భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 16 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ్టితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండడం వల్ల పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. రద్దీ అధికంగా ఉన్నట్టయితే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ సూపరిండెంట్​లకు ఆదేశాలు అందాయి.

వెల్లువలా దరఖాస్తులు
వెల్లువలా దరఖాస్తులు

By

Published : Nov 18, 2021, 1:59 PM IST

తెలంగాణలో డిసెంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు(new liquor policy in telangana 2021)లోకి రానుంది. అందులో భాగంగా రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఏర్పాటు(application for liquor license)కు ఆబ్కారీ శాఖ ఈ నెల 9వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మంగళవారం వరకు లిక్కర్ వ్యాపారుల నుంచి ఆబ్కారీ శాఖ ఆశించిన స్థాయిలో స్పందన లేదు. 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 14,751 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కానీ.. నిన్న(బుధవారం) ఒక్కరోజే 15,939 దరఖాస్తులు అందాయి. ఇవాళ దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడం వల్ల భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఇదే అంశంపై ఇప్పటికీ ఉన్నత స్థాయిలో చర్చించిన అధికారులు… రద్దీ అధికమైతే ఇబందులు తలెత్తకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రద్దీ మరీ అధికమైనట్లైతే టోకెన్స్ విధానం అమలు చేయాలని సూచించారు.

అత్యధికంగా ఖమ్మంలో..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 2,620 మద్యం దుకాణాల కోసం నిన్నటి వరకు 30,690 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు జారీ కోసం అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 122 మద్యం దుకాణాలకు 3,864 దరఖాస్తులు వచ్చి, ఒక్కో దుకాణానికి 32 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో హనుమకొండ, కొత్తగూడెం, శంషాబాద్, గద్వాల ఎక్సైజ్ జిల్లాలల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో 47 దుకాణాలకు 188 దరఖాస్తులు వచ్చి ఆత్యల్పంగా ఒక్కో దుకాణానికి కేవలం 4 దరఖాస్తులు వచ్చాయి. పెద్దపల్లి, కరీంనగర్ ఎక్సైజ్ జిల్లాల్లో కూడా తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

లక్ష్య దరఖాస్తులు వస్తాయనుకున్నారు.. కానీ..

2019-21 మద్యం విధి విధానాల ప్రకారం 2,216 మద్యం షాపులకు 49వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నూతన మద్యం విధానంలో ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు అన్న నిబంధనను తొలగించడంతో పాటు లైసెన్స్ విధానాన్ని సరళీకరణ చేశారు. ఇలా చేయడం వల్ల భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. ఇప్పుడున్న 2,216 దుకాణాలకు కొత్తగా మరో 404 దుకాణాలు అదనంగా ఏర్పాటు అవుతుండడంతో దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేసినా... వస్తున్న స్పందన చూస్తుంటే ఆ స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇవాళ చివరి రోజు కావడంతో తక్కువలో తక్కువ 30వేలకుపైగా ధరఖాస్తులు రావచ్చని భావిస్తోంది.

ఇదీ చూడండి:

విరసం నేత కల్యాణ్​రావు ఇంట్లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల సోదాలు

ABOUT THE AUTHOR

...view details