అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటిస్తూ...అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ఏర్పడింది. రేపు ఉదయం గుడ్లూరు నుంచి యథావిధిగా యాత్ర ప్రారంభం కానుంది.
న్యాయస్థానంలోనూ విజయం సాధిస్తాం...
మహాపాదయాత్రకు రోజురోజుకూ ప్రజల నుంచి స్పందన పెరుగుతోందని అమరావతి రైతులు అన్నారు. తమకు లభిస్తున్న స్పందన చూసి ప్రభుత్వం(Government) తట్టుకోలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులు కట్టి తీరతామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయస్థానం(Court)లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
నిన్న (బుధవారం) 16 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టిన రైతులు గుడ్లూరుకు చేరుకున్నారు. గుడ్లూరు సమీపానికి యాత్ర చేరుకోగానే గ్రామస్థులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఉప్పుటేరు వంతెన వద్ద పూలతో జై అమరావతి(Jai amaravati) అని రాసి రైతుల్ని ఆహ్వానించారు. అలాగే రైతుల రాక కోసం భారీ సంఖ్యలో వేచిచూసిన గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ రైతులు గుడ్లూరులోనే బస చేయనుండగా వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ఇవీచదవండి.