పాక్ చెర నుంచి విడుదలైన రాష్ట్ర మత్స్యకారులు మరికొద్ది గంటల్లో విజయవాడకు చేరుకోనున్నారు. హైదరాబాద్ చేరుకున్న వారు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ను కలుస్తారని మంత్రి మోపిదేవి తెలిపారు. 14 నెలలుగా పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న జాలర్లను నిన్న వాఘా సరిహద్దు వద్ద రాష్ట్ర మంత్రి బృందానికి పాక్ అప్పగించింది. మంత్రి మోపిదేవి వెంకటరమణ బృందం మత్స్యకారులను దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మరో ఇద్దరు జాలర్లు కూడా త్వరలో విడుదలవుతారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా వారికి అండగా ఉంటుందని అన్నారు. 20 మంది జాలర్లకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు.
మరికొన్ని గంటల్లో విజయవాడకు చేరుకోనున్న జాలర్లు - పాక్ చెర నుంచి విడుదలైన ఏపీ జాలర్ల వార్తలు
పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన రాష్ట్రానికి చెందిన జాలర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ను కలుస్తారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
today-fishermen-meet-cm-jagan-who-are-released-from-pak
Last Updated : Jan 7, 2020, 10:41 PM IST