ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 209 మందికి కరోనా.. 4,320కి చేరిన కేసులు - corona update in telangana

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 209 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం 4,320 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ మేయర్​ డ్రైవర్​కు సైతం కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

తెలంగాణలో కొత్తగా 209 మందికి కరోనా.. 4,320కి చేరిన కేసులు
తెలంగాణలో కొత్తగా 209 మందికి కరోనా.. 4,320కి చేరిన కేసులు

By

Published : Jun 11, 2020, 10:44 PM IST

తెలంగాణలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి వలస వచ్చినవారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 175 కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి మరో 9 మంది మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 165కు చేరింది.

ఇప్పటివరకు మొత్తం 4,320 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,993 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 2,162 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details