ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,209 కరోనా కేసులు.. 22 మరణాలు - నేటి కరోనా మరణాలు

16:48 August 06
రాష్ట్రంలో కొత్తగా 2,209 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,505 నమూనాలను పరీక్షించగా 2,209 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. తాజాగా.. 22 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,490కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు.. 1,896 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 20,593 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. కొత్తగా కరోనా కృష్ణా జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి