రాష్ట్రంలో కొత్తగా 59 కరోనా కేసులు Today Covid Cases: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 10,914సాంపిల్స్‌ను పరీక్షించగా 59 కరోనా కేసులు నమోదయ్యాయి. 83 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,32,78,495 సాంపిల్స్‌ని పరీక్షించారు.
దేశంలో మరో 2500 కరోనా కేసులు.. 97 మరణాలు
Covid Cases In India: దేశంలో రోజువారీ కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 2,568 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 97 మంది మరణించారు. కొత్తగా 4,722 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం మరణాలు:5,15,974
- యాక్టివ్ కేసులు:33,917
- కోలుకున్నవారు:4,24,46,171
World Corona cases:ప్రపంచవ్యాప్తంగానూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. తాజాగా 11,95,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 45,97,16,512 పెరిగింది. మరో 4,009 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,066,237కు చేరింది.
- దక్షిణ కొరియాలో 309,769కరోనా కేసులు నమోదయ్యాయి. 200మంది కరోనా రోగులు మరణించారు.
- జర్మనీలో తాజాగా 101,872కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 136మంది మృతి చెందారు.
- వియత్నాంలో 161,262మంది వైరస్ సోకింది. మరో 92 ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 17,267మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 326మంది వైరస్‌కు బలయ్యారు.
- రష్యాలో ఒక్కరోజే 41,055కేసులు బయటపడ్డాయి. 533మంది మరణించారు.
- బ్రెజిల్లో మరో 13,420మందికి వైరస్ సోకగా.. 187మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 18,853 కరోనా కేసులు బయటపడ్డాయి. 185 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: One Station One Product: ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ విధానం... తిరుపతికి లాభదాయకం