Today AP Covid Cases: రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,816 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,528 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి ప్రకాశం జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
వైరస్ భారీ నుంచి మరో 418 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 20,96,755కి చేరింది. నేటి వరకు 3,17,96,337 సాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
దేశంలో 2.64 లక్షల మందికి వైరస్
Corona cases in India: భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 315 మంది మరణించారు. 1,09,345 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:36,582,129
- మొత్తం మరణాలు:4,85,350
- యాక్టివ్ కేసులు:12,72,073
- మొత్తం కోలుకున్నవారు:3,48,24,706
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరింది.
ఇదీ చదవండి: దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి.. మరో 2.64 లక్షల మందికి వైరస్