అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 7న జరిగిన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఇరువర్గాల న్యాయవాదులు కోరారు. రేపటి నుంచి ఈనెల 30 వరకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి వేసవి సెలవులపై వెళ్లనున్నారు. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో రఘు రామకృష్ణ రాజు కోరారు.
సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ - ap latest news
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఈనెల 7న జరిగిన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఇరువర్గాల న్యాయవాదులు కోరారు.
cbi court to hear cm jagan bail cancel petition