Today Break to Amaravathi Padayatra: ఏకైక రాజధానిగా అమరావతిని నిలుపుకోవాలన్న సంకల్పంతో రైతులు చేపట్టిన పాదయాత్ర అన్ని ప్రాంతాలనూ కదిలిస్తోంది. నెల్లూరులో అన్నదాతలకు మద్దతు తెలిపేందుకు జనం పోటెత్తారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతుల చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు నగర వాసులంతా మమేకమయ్యారు. బడికి వెళ్లే చిన్నారులు మొదలుకొని.. 60 ఏళ్ల వృద్ధుల వరకు సంఘీభావంగా రోడ్డెక్కారు. రాజకీయ పార్టీలు, న్యాయవాదులు, వడ్డెర సంక్షేమ సంఘం, ప్రజాసంఘాలు సైతం కాలు కదిపాయి. పాదయాత్రకు వర్షంతో అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా.. అంకుఠిత దీక్షతో ముందుకు(Amaravathi Farmers Padayatra news) సాగారు.
ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగా.. మరోవైపు రైతులపై పూల వర్షం కురిపించారు. జై అమరావతి నినాదాలతో నగరమంతా మార్మోగిపోయింది. రాళ్లు పడతాయని బెదిరించిన వాళ్లు.. పూల వర్షం కురిపిస్తున్న ప్రజా స్పందనను చూడాలని రాజధాని రైతులు అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులుగా మీరు ఎగతాళి చేస్తే.. మంగళహారతులు పడుతూ తమ అకుంఠిత దీక్షకు మహాబాసటగా నిలుస్తున్న వైనాన్ని ప్రభుత్వం గ్రహించాలని వేడుకుంటున్నారు.
రైతుల పాదయాత్ర.. శనివారం ఉదయం పదిన్నర గంటలకు నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం బారాషాహీద్ దర్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భోజన విరామం అనంతరం మళ్లీ నడక ప్రారంభించారు. అంబాపురం వద్ద పాదయాత్ర ముగియగా రాత్రికి శాలివాహన ఫంక్షన్ హాల్‌లో రైతులు బస చేశారు. శనివారం 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. తిరుమల వరకు 435 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. శనివారం నాటికి 300కిలో మీటర్ల మైలు రాయిని దాటారు. రైతుల దృఢ సంకల్పానికి ప్రభుత్వం దిగి వచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తోందని మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
వలువురు విరాళాలు అందజేత..