హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఇవాళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారించనుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి నిర్బంధం సహా 10 పిటిషన్లపై కోర్టు వాదనలు విననుంది. ఇందుపల్లికి చెందిన వెంకటరాజు నిర్బంధంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావట్లేదంటూ వ్యాఖ్యలు చేసింది. విధులు సరిగా నిర్వర్తించకపోతే రాజీనామా చేయండి అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.