ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి కొడాలి నాని పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ - హైకోర్టులో కొడాలి నాని పిటిషన్

మంత్రి కొడాలి నాని హౌస్‌మోషన్ పిటిషన్‌పై మరోసారి హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మంత్రి మాట్లాడిన వీడియో టేపులు సమర్పించాలని ఇప్పటికే ఎస్​ఈసీని కోర్టు ఆదేశించింది.

kodali nani
kodali nani

By

Published : Feb 15, 2021, 10:22 AM IST

మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. మీడియాతో మాట్లాడవద్దన్న ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొడాలి నాని కోర్టులో పిటిషన్ వేశారు.

అసలేం జరిగిందంటే...?

రాష్ట్రంలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని)ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశించారు. అప్పటి వరకు మంత్రి సమావేశాల్లోగానీ, బృందాలతోగానీ మాట్లాడరాదని తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టరు, ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్‌ ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలన్నారు.

గతంలో విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈసీని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని, దానిపై సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని రమేశ్‌కుమార్‌ ఆయనకు షోకాజ్‌ నోటీసిచ్చారు. మంత్రి తన న్యాయవాది చిరంజీవి ద్వారా ఎస్‌ఈసీకి బదులిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్ష పార్టీ అరాచకాల్ని బయటపెట్టే క్రమంలో మీడియా సమావేశం నిర్వహించానని నాని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల తనకు గౌరవం ఉందని, ప్రత్యేకించి ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తానని, షోకాజ్‌ నోటీసు ఉపసంహరించుకోవాలని మంత్రి కోరారు. సంతృప్తి చెందని రమేశ్‌కుమార్‌... మంత్రిపై చర్యలు తీసుకుంటూ ఏడు పేజీల సుదీర్ఘ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నాని.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా కమిషనర్ ఉత్తర్వులున్నాయని, వాటి అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు.

ఈ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఈసీని మంత్రి ఏమీ అనలేదని.... కొడాలి వ్యాఖ్యలు ఇతరుల వాటితో పోల్చలేమని ఎస్‌ఈసీ న్యాయవాది వాదించారు. వీడియో పరిశీలిస్తే విషయం తెలుస్తుందని సూచించారు. కొడాలి వీడియో ఫుటేజ్‌ను ఫైల్ చేసారా అని రిజిస్టర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. లేదని రిజిస్టర్ బదులిచ్చారు. వీడియో ఫుటేజ్ ఇస్తామని... పరిశీలించాలని ఎస్ఈసీ కోర్టును కోరింది.

ఇదీ చదవండి

నెల్లూరు జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..

ABOUT THE AUTHOR

...view details