రాష్ట్రంలో కరోనా వ్యాప్తి(ap corona cases) కొనసాగుతోంది. తాజాగా 259 కొత్త కేసులు(259 news corona cases) నమోదైనట్టు వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 33,437 శాంపిల్స్ పరీక్షించగా.. 259 మంది పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. కొత్తగా 354 మంది కోలుకున్నట్టు వెల్లడించారు. అలాగే.. గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా.. కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.
ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 259 కరోనా కేసులు, ఐదుగురు మృతి - ఏపీ కరోనా న్యూస్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి(ap corona cases) కొనసాగుతోంది. తాజాగా 259 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనాతో మంగళవారం ఐదుగురు మృతి చెందారని తెలిపారు.
ap corona cases
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,95,77,756 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 20,64,034 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20,45,610 మంది కోలుకోగా.. 14,382 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4042 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి:CORONA: కాకినాడలో కరోనా కలకలం.. వసతి గృహంలోని వైద్య విద్యార్థులకు మహమ్మారి