తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మంగళ, బుధ వారాల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు - telengaga whethear report
తూర్పు మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో మంగళవారం, బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ రోజు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు
తూర్పు మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నాయిని పేర్కొంది. గురువారం నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇవీ చూడండి:తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి