తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 605 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,26,690కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,691కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,088 మంది కోలుకోవడం ద్వారా తెలంగాణలో కోలుకున్న వారి సంఖ్య 6,11,035కు చేరింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 11,964 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.