ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా ఆరుగురికి కరోనా.. 1009కి చేరిన కేసులు - TOTAL CASES RAISED TO 1009

తెలంగాణలో ఇవాళ కొత్తగా మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ వివరాలు వెల్లడించారు. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 1009కి చేరుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో కొత్తగా 6 కరోనా.. 1009కి చేరిన కేసుల సంఖ్య
తెలంగాణలో కొత్తగా 6 కరోనా.. 1009కి చేరిన కేసుల సంఖ్య

By

Published : Apr 28, 2020, 9:38 PM IST

తెలంగాణలో ఇవాళ కొత్తగా 6 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మొత్తంగా పాజిటివ్ కేసులు 1009కి పెరిగాయన్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని మంత్రి వివరించారు. ఇవాళ ఒక్క రోజే 42 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. 374 మంది కోలుకుంటున్నారని, వారంతా డిశ్చార్జ్‌ కానున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 50 శాతానికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఈటల అన్నారు.

ABOUT THE AUTHOR

...view details