రాష్ట్రంలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,702 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7174కి చేరింది. 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,36,179 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 136 కరోనా కేసులు, ఒక మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి కొత్తగా ఒకరు చిత్తూరు జిల్లాలో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్ కేసులున్నాయి.
ap carona cases