నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి కోట్ల రూపాయలు దండుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చిన.. వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు రవి కుమార్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని టీఎస్టీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ప్రతాప్, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అధికారులకు టీఎన్టీయూసీ అధ్యక్షుడు రఘురామరాజు వినతి పత్రం అందజేశారు. ఆ ఫెడరేషన్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులు అందరినీ శిక్షించాలన్నారు. ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు రిఫర్ చేసి ఆర్టీసీ గౌరవాన్ని కాపాడాలని టీఎస్టీయూసీ సభ్యులు కోరారు.
'ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చిన వారిపై చర్యలు తీసుకోవాలి'
నిరుద్యోగ యువతను మోసం చేసి కోట్ల రూపాయలు ఆర్జించిన వైెఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌పై చర్యలు తీసుకోవాలని టీఎస్టీయూసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చిన ఆ ఫెడరేషన్ గుర్తింపును రద్దు చేయాలంటూ... సంస్థ ఎండీకి వినతి పత్రం అందజేశారు.
వైెఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌పై చర్యలు తీసుకోవాలని టీఎస్టీయూసీ సభ్యులు వినతి పత్రం