రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ప్రబలుతున్న తరుణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలా? లేక ప్రాణాలు రక్షించుకోవాలా? అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ.ప్రణవ్‌గోపాల్ నిలదీశారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయన్న ప్రభుత్వ ప్రకటనను.. టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. విద్యార్థులకు ఇచ్చిన లిమిటెడ్ సిలబస్ కూడా పూర్తి కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నందున పరీక్షలను వాయిదా వేయకుంటే.. విద్యార్థి సంఘాలతో కలిసి తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.
'పరీక్షలు రాయాలా... ప్రాణాలు రక్షించుకోవాలా..'
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా ప్రబలుతుంటే పరీక్షలు నిర్వహించటం ఏమిటని నిలదీశారు. విద్యార్థుల ప్రాణాలకు సీఎం బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.
టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్ గోపాల్