ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల నిర్బంధాలు, అరెస్టులు

tdp
tdp

By

Published : Sep 2, 2021, 9:10 AM IST

Updated : Sep 2, 2021, 1:42 PM IST

13:41 September 02

తిరుపతి: తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత

  • తిరుపతి: తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత
  • తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నల్ల బెలూన్లు ఎగురవేసేందుకు నేతల యత్నం
  • రాష్ట్రంలో మహిళలకు భద్రత కొరవడిందంటూ తెదేపా నేతల నిరసన
  • తిరుపతి: తెదేపా నేతలను అడ్డుకుని తూర్పు స్టేషన్‌కు తరలింపు
  • తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబుపై చేయిచేసుకున్న పోలీసులు
  • తెదేపా నేతలు సంజయ్‌, రవినాయుడు సహా పలువురి అరెస్టు

13:22 September 02

తెదేపా నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

  • శ్రీకాకుళం: తెదేపా నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
  • కూన రవికుమార్, లక్ష్మీదేవిని ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు
  • శ్రీకాకుళం: తెదేపా నేతలను ఒకటో పట్టణ పీఎస్‌కు తరలింపు

12:23 September 02

విశాఖ దిశ పీఎస్‌ వద్దకు వచ్చిన తెదేపా నేతల ముందస్తు అరెస్టు

  • విశాఖ దిశ పీఎస్‌ వద్దకు వచ్చిన తెదేపా నేతల ముందస్తు అరెస్టు
  • టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ సహా పలువురి అరెస్టు
  • మహిళలకు రక్షణలేని ప్రభుత్వమిది: ప్రణవ్‌ గోపాల్‌
  • దిశ చట్టమే లేకుండా నేరస్థులను ఎలా శిక్షిస్తుంది: ప్రణవ్‌ గోపాల్‌
  • మహిళలకు భద్రత పెంచాలని పీఎస్‌లో వినతిపత్రం ఇచ్చాం: ప్రణవ్‌ గోపాల్‌

12:23 September 02

విజయవాడలో నిరసన ర్యాలీకి తలపెట్టిన తెలుగు మహిళ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌

  • విజయవాడలో నిరసన ర్యాలీకి తలపెట్టిన తెలుగు మహిళ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌
  • విజయవాడలో కేశినేని భవన్ నుంచి దిశ పీఎస్‌ వరకు ర్యాలీకి పిలుపు
  • విజయవాడ కేశినేని భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • పార్టీ కార్యాలయంలోకి అనుమతించకుండా నేతలు, కార్యకర్తల అరెస్టు
  • విజయవాడ: కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్న పోలీసులు

10:53 September 02

విశాఖలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత గృహనిర్బంధం

విశాఖలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత గృహనిర్బంధం

దిశ పీఎస్ వద్ద నిరసనకు పిలుపు ఇవ్వడంతో పోలీసుల ముందస్తు చర్యలు

10:21 September 02

తెదేపా మహిలానేతల గృహనిర్బంధం

తెదేపా మహిళా నేతల గృహనిర్బంధం

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన తేదేపా మహిళా నాయకులను అనంతపురంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సర కాలంలో 500 మందికి పైగా మహిళలపై దాడులు జరిగాయని ఆరోపించారు. దిశ చట్టం ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టాలని చూస్తున్నా అక్రమ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు దాడులు చేసిన పేద ప్రజలకు మద్దతుగా తెదేపా ఉంటుందని తెలిపారు.

10:21 September 02

దిశ పీఎస్‌ వద్ద ఆందోళనకు సిద్ధమవుతుండగా సాయికృష్ణ అరెస్టు

  • గుంటూరు: తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ అరెస్టు
  • దిశ పీఎస్‌ వద్ద ఆందోళనకు సిద్ధమవుతుండగా సాయికృష్ణ అరెస్టు
  • రమ్య హత్య కేసు నిందితులను 21 రోజుల్లో శిక్షించాలని డిమాండ్‌
  • ముందస్తుగా తెలుగు యువత నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

09:42 September 02

విశాఖలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, తెలుగు మహిళల గృహనిర్బంధం

  • విశాఖలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, తెలుగు మహిళల గృహనిర్బంధం
  • దిశ చట్టం అమలులో లోపాలు సరిదిద్దాలని నిరసనలకు తెదేపా పిలుపు
  • ముందస్తుగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను గృహనిర్బంధించిన పోలీసులు

08:46 September 02

విజయనగరంలో పలువురు తెదేపా నేతల గృహనిర్బంధం

  • విజయనగరంలో పలువురు తెదేపా నేతల గృహనిర్బంధం
  • తెదేపా నేతలు వేమలి చైతన్యబాబు, ఐవీపీ రాజు గృహనిర్బంధం
  • రాష్ట్రవ్యాప్తంగా దిశ పీఎస్‌ల ముందు నిరసనలకు లోకేశ్‌ పిలుపు
  • దిశ చట్టం అమలు చేయాలని కోరుతూ ధర్నాలు, నిరసనలు

08:42 September 02

దిశ పోలీస్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు పిలుపుతో పోలీసుల చర్యలు

తెదేపా మహిళా నేతల గృహనిర్బంధం
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా దిశ పీఎస్‌ల ముందు నిరసనలకు లోకేశ్‌ పిలుపు
  • నేడు టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత, తెలుగు మహిళల ఆందోళనలు
  • దిశ చట్టం అమలు చేయాలని కోరుతూ ధర్నాలు, నిరసనలు
Last Updated : Sep 2, 2021, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details