ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వార్థాన్ని కాస్త తగ్గించుకుంటేనే...! - తెలంగాణ వార్తలు

దంపతులు ఎవరికివారే స్వార్థంగా ఆలోచించడం వల్ల బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కాకూడదంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమిటంటే...!

tips-for-husband
tips-for-husband

By

Published : Mar 4, 2021, 12:06 PM IST

కొందరు తమను తామే చాలా గొప్పగా ఊహించుకుంటూ స్వార్థంగా ఆలోచిస్తుంటారు. ఏ విషయంలోనూ కొంచెం కూడా సహనం ఉండదు. కాస్త సమయాన్ని కూడా ఎదుటివారికి కేటాయించడానికి అంగీకరించరు. ఇలాంటి స్వార్థపూరితమైన ప్రవర్తన వల్ల బంధానికి బీటలు వారతాయి. ఇలాంటివారు ఎదుటివారికి సహకరించరు సరికదా వారిని అర్థం చేసుకోవడానికీ ప్రయత్నించరు. అలాకాకుండా తమను తాము కాస్త తగ్గించుకుని ఎదుటివారి కోసం ఆలోచిస్తేనే ఆ బంధం నిలబడుతుంది.

* దంపతుల్లో ఒకరికి ఉద్యోగపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆశయం ఉండొచ్చు. నిజానికి ఇదేమీ అత్యాశ కాదు, అలాగని తప్పూకాదు. ఈ ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడి పనిచేయాల్సి రావచ్చు. దీంతో ఎంతసేపూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తున్నాడనీ, తనను పట్టించుకోవడం లేదనే ఆలోచన ఎదుటివారికి రావచ్చు. అందుకే ఇదే విషయాన్ని భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ క్రమంలో అవసరమైతే ఎదుటివారి సహకారాన్నీ తీసుకోవాలి.

*కొందరికి వ్యాపారం చేసి జీవితంలో పైకి ఎదగాలనే ఆశ ఉండొచ్చు. అందుకోసం భాగస్వామిని పట్టించుకోకుండా ఎక్కువ సమయం బయటే గడపాల్సి రావచ్చు. తన స్వార్థం కోసమే ఇలా చేయడంలేదని కుటుంబం కోసం కష్టపడుతున్నాననే విషయాన్ని ఎదుటివారికి వివరించి చెప్పాలి. లేకపోతే స్వార్థపరులనే ముద్రతోపాటు అనవసర అపార్థాలకూ తావిచ్చినట్టు అవుతుంది.

ఇదీ చూడండి:

'ఇలాంటి పాత్ర కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details