రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్నందున పని వేళలను తాత్కాలికంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి ఉదయం11.30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కర్ఫ్యూ ఎఫెక్ట్: ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు - andhrapradhesh corona cases
ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు
16:59 May 07
ఉదయం 8 నుంచి 11.30 వరకే ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు
సచివాలయం, ఉన్నతాధికారుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాలలో ఈ సమయాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ మేనేజ్మెంట్ విధులు నిర్వహించే శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖలకు పనివేళల్లో మార్పులు ఉండవని, వీరు గత సమయవేళల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:
Last Updated : May 7, 2021, 6:50 PM IST