ప్రేమ పేరుతో వంచించాడు... ఆపై తనువు చాలించాడు! - పాల్పడ్డాడు
వాళ్లిద్దరికి టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో ఆ అమ్మాయి నుంచి బంగారం, డబ్బు తీసుకున్నాడు. మోసం చేశాడని ఆ అబ్బాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాయికి ఫోన్ చేయగా... భయంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
టిక్‌టాక్ పరిచయం ఓ యువకుడి చావుకు కారణమైంది. తెలంగాణలోని హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన సాయి అనే యువకుడికి... కర్నూలు యువతి టిక్‌టాక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. సాయి ప్రేమ పేరుతో తన అవసరాల కోసం అమ్మాయి వద్ద డబ్బులు, బంగారు గొలుసు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ కోసం పోలీసులు సాయికి ఫోన్ చేయగా... భయంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సాయి జొమోటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఎస్ఆర్ నగర్ పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడం వల్ల ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.