ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీలో పెరుగుతున్న కేసులు..వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద భద్రత కట్టుదిట్టం

ఏపీలో కరోనా పాజిటివ్​ కేసులు పెరగడం వల్ల తెలంగాణలోని నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ap-tg borders
ఏపీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. భద్రత కట్టుదిట్టం చేసిన తెలంగాణ చెక్ పోస్టు

By

Published : May 12, 2020, 6:58 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు పెరగడం వల్ల... తెలంగాణ సరిహద్దు వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ డీజీపీ, కమిషనర్ పాస్​లు ఉన్నవారినే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. మెుదటగా వారి పేర్లు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం క్వారంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నారు. రోజు 150 నుంచి 200 మంది సొంత వాహనాలలో ఏపీ నుంచి తెలంగాణలోకి వాడపల్లి సరిహద్దు ద్వారా వస్తున్నారని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details