సచివాలయ మార్గంలో భారీ బందోబస్తు.. 144 సెక్షన్ - సచివాలయ మార్గంలో భారీ బందోబస్తు
అమరావతి పరిధిలో రైతుల ఆందోళనలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో 14వ రోజూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే సందర్భంలో.. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వస్తున్నారు. ఆయన ప్రయాణించే మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందడంలో రహదారిపై టెంట్ వేసేందుకు నిరాకరించారు. గ్రామంలో నిరంతర పహారా కాస్తున్నారు. పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సచివాలయం వరకు 144 సెక్షన్, 30 యాక్ట్ విధించారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. గుర్తింపు కార్డులు ఉన్న వారినే అనుమతిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా.. అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. సీఎం రాకతో పాటు.. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బందోబస్తు పటిష్టం చేశారు.