ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రహదారిపై రారాజు.. భయం పుట్టిస్తున్న పెద్దపులి - పులి కలకలం నేటి వార్తలు

తెలంగాణ రాష్ట్రం... జైనథ్​ మండలంలోని నీరాలలో పెద్దపులి సంచరిస్తూ గ్రామస్థులను భయాందోళనలకు గురిచేస్తోంది. నీరాల శివారులోని ప్రధాన రహదారిపై పెద్దపులి సంచరిస్తుండగా ఓ వ్యక్తి సెల్​ఫోన్​లో చిత్రీకరించాడు.

tiger wandering at nirala in adilabad district
tiger wandering at nirala in adilabad district

By

Published : Feb 26, 2020, 10:29 AM IST

రహదారిపై రారాజుల సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

తెలంగాణ.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నీరాలలో పెద్దపులి సంచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. నీరాల శివారులోని బేల-ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి సంచరిస్తుండగా కారులో ప్రయాణిస్తున్న బేలవాసి గుర్తించాడు. కారును నిలిపివేసి పులిని సెల్​ఫోన్​లో చిత్రీకరించాడు.

లక్ష్మీపూర్​ కెనాల్​లో నీళ్లు తాగడానికి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details