తెలంగాణలోని నల్లమలలో పల్స్ పోలియో కార్యక్రమానికి వెళ్తున్న వైద్య సిబ్బందికి పెద్దపులి ఎదురైంది. భయాందోళనకు గురైన సిబ్బంది.. వాహనాన్ని అక్కడే నిలిపేసి.. పులి సంచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
తెలంగాణ: ఎదురొచ్చిన పులి... నిలిచిపోయిన వైద్య సిబ్బంది వాహనం...
పల్స్ పోలియో కార్యక్రమానికి వాహనంలో వెళ్తున్న సిబ్బందికి.. పెద్దపులి ఎదురైంది. భయాందోళనకు గురైన సిబ్బంది.. అది వెళ్లేంత వరకు అటవీ మధ్యలోనే ఉండిపోయారు. పెద్దపులి సంచారాన్ని తమ చరవాణుల్లో చిత్రీకరించారు. ఈ సంఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామ పరిధిలో జరిగింది.
తెలంగాణ: ఎదురొచ్చిన పులి... నిలిచిపోయిన వైద్య సిబ్బంది వాహనం...
నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామ పరిధిలోని చెంచుపెంటలో.. చిన్నారులకు పోలియో చుక్కలను వేసేందుకు వైద్య సిబ్బంది ఓ వాహనంలో వెళ్లారు. కొంత దూరం వెళ్లేసరికి... సంగిడిగుండాల వద్ద రహదారిపై తిరుగుతూ పెద్దపులి తారసపడింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన సిబ్బంది.. వాహనాన్ని కొద్దిసేపు అక్కడే నిలిపేశారు. పెద్దపులి సంచారాన్ని చరవాణుల్లో చిత్రీకరించారు. పులి వెళ్లేంత వరకు వేచిచూసి.. అనంతరం పల్స్ పోలియో కార్యక్రమానికి హాజరయ్యారు.