తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సాయంత్రం వేళ ఆవుపై దాడి చేసి.. హతమార్చడం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆవులమందపై పులి దాడి చేసి ఆవును లాక్కెళ్లటాన్ని చూసిన పశువుల కాపరి భయంతో పరుగులు తీశాడు. గ్రామస్థులకు సమాచారమివ్వగా... అందరూ కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించగా... చనిపోయిన ఆవు కన్పించింది.
ఉదయం పూట ఆర్టీసీ డ్రైవర్‌కి పులి కనిపించిందన్న విషయం దావానంలా వ్యాపించింది. మధ్యాహ్నం వేళ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా.. ఫలితం లేకపోయింది. మళ్లీ సాయంత్రం పులి దాడి చేయటం వల్ల ఘటన తెలిసి పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.