తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌ని కలిశారు. తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేశారు. పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాలేరులో తనను ఓడించిన వారే.. ప్రస్తుతం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ: 'అప్పుడు ఓడించారు.. ఇప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు' - thummala nageswara rao complaint on social media news
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నారని ఈ మధ్యకాలంలో కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని తుమ్మల ఖండించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌ను కోరారు.
సీపీ కి ఫిర్యాదు చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కేసీఆర్ అసాధారణ రీతిలో గౌరవించారు...
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అసాధారణ రీతిలో గౌరవించారని తుమ్మల వ్యాఖ్యానించారు. ఓడిపోయినా మంత్రిగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. సీఎం సహకారంతో జిల్లాకు రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. కావాలనే తనపై కొందరు అక్కసు వెళ్ల గక్కుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.