ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వంట గ్యాస్ ధరల పెంపుతో మహిళలకు కన్నీళ్లు: తులసిరెడ్డి

కేంద్రం... పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచటంపై ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. భాజపా ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడం గర్హనీయమని అన్నారు.

Thulasireddy
తులసిరెడ్డి

By

Published : Feb 15, 2021, 4:34 PM IST

వంట గ్యాస్ ధరల పెంపుతో భాజపా ప్రభుత్వం.. మహిళలకు కన్నీళ్లు మిగులుస్తోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే సెంచరీ కొట్టేలా ఉన్నాయని ఆవేదన చెందారు. గత డిసెంబర్ 2వ తేదీన రూ.50, డిసెంబర్ 15న రూ.50, ఫిబ్రవరి 4న రూ.25, 14న మళ్లీ 50 రూపాయలు పెంచారని గుర్తు చేశారు.

ఈ ఏడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​లో లీటర్ పెట్రోల్ మీద 2.50 పైసలు, లీటరు డీజిల్​పైన 4 రూపాయలు అగ్రి - ఇన్ ఫ్రా సెస్సు విధించడం దుర్మార్గమని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే గోరుచుట్టుపై రోకటి పోటు లాగా ధరలు పెంచడం భావ్యమా అని... తులసిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details