తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపట్నం 133/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపాలా? అధిక లోడు వల్ల ఏర్పడిన ఒత్తిడికి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.