కేంద్ర జలశక్తిశాఖ అమలు చేస్తున్న డ్యాం రీహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాజెక్టుల మరమ్మతులకు అవకాశం దక్కనుంది. మొదట 31 ప్రాజెక్టులను ప్రతిపాదించినా చివరికి మూడింటికి.. అదీ రూ.100 కోట్లలోపు ఖర్చయ్యే వాటికే అనుమతి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం, ధవళేశ్వరం, రైవాడ జలాశయాల్లో కొన్ని పనులకు డ్యాం భద్రతా కమిటీ సిఫార్సు చేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
Repairs to Projects: డ్రిప్ కింద మూడు ప్రాజెక్టులకు చోటు..త్వరలో మరమ్మతులు! - reservoirs repair
DRIP Programme: కేంద్ర జలశక్తిశాఖ అమలు చేస్తున్న డ్యాం రీహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు చోటు దక్కింది. డ్రిప్ కింద శ్రీశైలం, ధవళేశ్వరం, రైవాడ ప్రాజెక్టులకు మరమ్మతులు చేసే అవకాశం లభించింది.
reservoirs repair in ap
కేంద్ర ప్రభుత్వం డ్రిప్‌ను ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ సాయంతో చేపడుతోంది. డ్రిప్ రెండో దశ కింద దేశవ్యాప్తంగా రూ.5వేల కోట్లను ఖర్చు చేయనుంది. పథకానికి కేంద్రం 70%, రాష్ట్రం 30% నిధులను భరిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.750 కోట్లు వచ్చే అవకాశముంది.
- శ్రీశైలం ప్రాజెక్టులో రూ.790 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రతిపాదించారు. కీలకమైన ప్లంజ్ పూల్ తప్ప మిగిలిన పనులు చేపట్టేందుకు డ్యాం భద్రతా రివ్యూ ప్యానెల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందులో సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం, ఇతర పనులూ ఉన్నాయి.
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజిలో రూ.60 కోట్లతో పనులు చేపట్టేందుకు సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం. స్పిల్‌వే దిగువన యాప్రాన్ పనులు, గేట్ల మరమ్మతు, గేట్లను ఎత్తేందుకున్న ఏర్పాట్లను ఆధునీకరించడం వంటి పనులను ప్రతిపాదించారు.
- రైవాడ జలాశయం హైడ్రాలజీ పనులను డ్రిప్‌లో చేర్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: