రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో సెల్లార్ గుంతలో పని చేస్తున్న కార్మికులపై మట్టి పెల్లలు పడటంతో ఇద్దరు మృతిచెందారు. సెల్లార్ కోసం శ్లాబ్ వేసేందుకు రాడ్ పనులు చేస్తుండగా పైనుంచి ఒక్కసారిగా మట్టికుప్ప వారిపై పడింది. ప్రమాద సమయంలో 13 మంది కార్మికులు పని చేస్తున్నారు. మట్టి కింద పడగానే 11 మంది తప్పించుకోగా... ఇద్దరు మాత్రం మట్టి కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు. నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించని నిర్మాణ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి - Three persons are died in hyd
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. భవన నిర్మాణానికి గుంత తీస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. నార్సింగి పరిధిలోని పుప్పాల్‌గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ముగ్గురు మృతి
Last Updated : Jun 25, 2022, 8:26 PM IST