ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో దోపిడీ చేసి.. చింతపల్లిలో చిక్కి.! - narsipatnam latest news

గుంటూరులో ఓ వ్యక్తిపై దౌర్జన్యం చేసి దోపిడీకి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని.. విశాఖ జిల్లా చింతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముగ్గురు చింతపల్లి మండలం, లంబసింగి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా తెలుసుకున్న గుంటూరు పోలీసులు.. చింతపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కిన్నెర్ల గ్రామస్థుల సహకారంతో వారు దొంగలను పట్టుకున్నారు.

three people who escaped after committing robbery in Guntur were arrested in chintapally at vishakapatnam
కిన్నెర్ల గ్రామస్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్న ఎస్సై అలీ

By

Published : Dec 13, 2020, 1:51 PM IST

గుంటూరులో ఓ వ్యక్తిపై దౌర్జన్యం చేసి దోపిడీకి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని... విశాఖ జిల్లా చింతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎస్సై మహ్మద్‌ అలీ నిందితుల వివరాలు వెల్లడించారు. గుంటూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొద్దిరోజుల క్రితం... ఓ వ్యక్తిపై ముగ్గురు కత్తులతో దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముగ్గురు చింతపల్లి మండలం, లంబసింగి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా తెలుసుకున్న గుంటూరు పోలీసులు చింతపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో శుక్రవారం రాత్రి నిందితుల కోసం గాలించగా... కిన్నెర్ల సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. రాత్రి సమయం కావడంతో కిన్నెర్ల గ్రామస్థుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై అలీ చెప్పారు. గుంటూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఇక్కడకు వచ్చి నిందితులను తీసుకువెళ్లారన్నారు. పోలీసులకు సహకరించిన కిన్నెర్ల గ్రామానికి చెందిన యువకులకు ప్రోత్సాహకాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details