తెలంగాణలో ఇద్దరు వైద్యులు సహా మరో వ్యక్తికి కరోనా - తెలంగాణలో ఇద్దరు వైద్యులు సహా మరో వ్యక్తికి కరోనా
14:33 March 26
కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. తెలంగాణలో మరో ముగ్గురికి వ్యాపించింది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 44కి చేరాయి. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి వ్యాధి సోకింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే వ్యాధి సోకినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు ఇటీవలే దిల్లీ నుంచి వచ్చాడు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దోమలగూడకు చెందిన 36 ఏళ్ల వైద్యురాలు, 43 ఏళ్ల వైద్యుడికి కరోనా సోకింది. వీరిద్దరూ దంపతులు.