తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని దర్పెల్లి మండలం వాడి గ్రామంలో సాయవ్వ, బాలగంగారం దంపతులు నివాసముంటున్నారు. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్తె లతను డిచ్‌పెల్లి మండలానికి చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. లత కూతురు సంధ్యను ఇందల్వాయికి చెందిన రవికి ఇచ్చి పెళ్లిచేశారు.
ఈనెల 4వ తేదీని బాలగంగారం అనారోగ్యంతో మృతి చెందగా.. 14వ తేదీన లత కూతురు సంధ్య కరోనా చికిత్స పొందుతూనే మగ శిశువుకు జన్మనిచ్చి మృత్యువాతపడింది. కూతురు చనిపోయిన 5 రోజులకు వైరస్‌తో లత సైతం తుది శ్వాస విడిచింది. మృతులు వేరే గ్రామాల్లో ఉంటున్నా.. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.