ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోదావరిలో స్నానానికి వెళ్లి.. ముగ్గురు మృతి - sad news

తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

three members died
గోదావరి నదిలో స్నానాలకు వెళ్లి ఐదుగురు గల్లంతు

By

Published : Mar 19, 2021, 8:01 PM IST

స్నానం కోసం భద్రాచలం వద్ద గోదావరి నదిలో దిగిన ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని భద్రాచలం అయ్యప్పకాలనీలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యానికి... ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రి నుంచి కొందరు బంధువులు వచ్చారు. మధ్యాహ్నం పక్కనే ఉన్న గోదావరి నదికి స్నానం చేసేందుకు వెళ్లారు.

గోదావరిలో స్నానాలకు వెళ్లి ముగ్గురు మృతి

ఒక బాలుడు మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నం చేసి... మొత్తం ఐదుగురు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోదావరిలో మునిగి పోయిన బాలుడు, మహిళ మృతదేహాలను బయటకు తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. మొత్తం ఐదుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు మహిళలు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:మల్లెంపూడి బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details