తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. వేబ్రిడ్జి వద్ద నుంచి లారీని రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా లారీ జాతీయ రహదారిపైకి రావడంతో.. పిట్టంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ద్విచక్రవాహనానికి తగిలింది.
ACCIDENT: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి - telangana 2021 news
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వాసి హరీశ్‌గా గుర్తించారు. మరో ఇద్దరు హైదరాబాద్ రామంతాపూర్ వాసులని తేల్చారు. మృతులు హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:రెచ్చిపోయిన దొంగలు..ఆ ఆలయాల్లో చోరీ