ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
తెలంగాణ: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి - ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్ జిల్లా కాంకేర్ జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల... పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా... ఓ ఎస్ఎస్బీ జవాన్‌కు గాయాలయ్యాయి.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
కోసరోడ్లోని ఎస్ఎస్బీ క్యాంపు వద్ద కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జవాన్‌కు గాయాలయ్యాయి. మృతదేహలతోపాటు, ఆరు ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను కాంకేర్ జిల్లా ఎస్పీ గోరక్ నాద్ బగేల్ ధ్రవీకరించారు.