Three labourers died in Balharshah train collision: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బల్లార్షా రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. బెంగళూరు నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. కొత్తపల్లి వద్ద కార్మికులను ఢీకొట్టింది. హుస్సేన్‌మియా వాగువద్ద ట్రాక్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది.
తెలంగాణ: పెద్దపల్లి జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి - Train accident in Peddapally district
Three died in Train Accident: ట్రాక్‌పై మరమ్మతులు చేస్తున్న కార్మికులను రైలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో జరిగింది.
![తెలంగాణ: పెద్దపల్లి జిల్లాలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి train](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16424159-782-16424159-1663671771484.jpg)
train